kalarchana 2019

A year to celebrate our Ancient Agricultural Civilization

జిల్లా స్థాయి 64 + కళలు (District level 64+ Arts)

64+ కళలు అంటే మా ఉద్దేశం అన్ని సంప్రదాయ కళలు మరియు నూతన కళలని. నృత్యం నుండి, వ్యవసాయం నుండి ఫోటోగ్రఫీ నుండి ఆహరం వండడం నుండి ఏదైనా సరే ! 

  • 64+ కళలలో మీకు ఏ కళలోనైనా పట్టణ లేదా జిల్లా స్థాయి ప్రావిణ్యం ఉందా?
  • మీ కళ జిల్లా లో ఎవరికీ తెలియకి కళనా ?

మీ కళను ప్రజలకు పరిచయం చేయడానికి కళార్చన ఆహ్వానం పలుకుతుంది. భేషరతుగా ఏ సందేహం  లేకుండా క్రింది విధంగా  దరఖాస్తు పంపగలరు

దరఖాస్తు విధానం: 
9542196200 నంబరుకి whatsapp లేదా telegram ద్వారాగాని valueskalarchana@gmail.com కి email ద్వారా గాని క్రింది సమాచారం పంపగలరు:

1) మీ పేరు :

2) మీ వయసు :

3) మీ ఫోన్ నెంబర్ :

4) మీ వృత్తి / పాఠశాల / కళాశాల పేరు :

5) మీ ఊరు :

6)  మీ కళ పేరు :

7) క్రింది పట్టిక లో చెప్పిన విధంగా మీరు ప్రదర్శించదలచిన కళ యొక్క  వీడియో / ఫోటో రుజువులు పంపగలరు :

8) మీ కళకు గుర్తుగా ఉన్న సర్టిఫికేట్స్ , న్యూస్ ఆర్టికల్స్ యొక్క ఫోటోలు :

కళార్చననందు మీ కళ ప్రదర్శించు ప్రదేశము కళ వీడియో / ఫోటో రుజువులు
స్టేజి / ఎరీనా / గ్రౌండ్ లో ప్రదర్శించగలిగినవి నాటకం, నృత్యం, యుద్ధ/వ్యాయమ కళలు,   సంగీతం, వాయిద్యం, గారడీ, విజ్ఞాన/సామాజిక ఉపన్యాసాలు ….. మీ కళ యొక్క వీడియో
క్రీడలు మీ క్రీడా నైపుణ్యం తెలిసే విధంగా చిన్న వీడియో
స్టాల్స్ లో ప్రదర్శించగలిగినవి రచనలు పుస్తకమైతే : మీ పుస్తక మొదటి కొన్ని పేజీల ఫోటోలు.

చిన్న కధ/వ్యాసం/కవిత అయితే : పూర్తి సమాచారం కనపడేట్లు ఫోటోలు

చిత్ర కళ, ఫోటోగ్రఫీ, చేతి వృత్తుల ఉత్పత్తుల ప్రదర్శనలు, …. మీ కళ యొక్క ఫోటోలు
వ్యవసాయ ప్రదర్శనలు, పశు ప్రదర్శనలు,  ఆహార ప్రదర్శనలు, విజ్ఞాన ప్రదర్శనలు, చిన్న సినిమాలు ….. మీరు ప్రదర్శించాలనుకునే అంశం యొక్క వీడియోలు
గమనిక : ఒకటే అప్లికేషన్ ద్వారా వేల రకముల కళలను ఒక చోటికి తీసుకొచ్చే ప్రయత్నం లో కొన్ని ఇబ్బదులు తలెత్తుతాయి. కనుక సందేహాలకు 9542196200  ఫోన్ చేయగలరు.  సమాచార వివరముల లో వెలితి ఉన్నట్లయితే జూరీలు మీకు ఫోన్ చేసి తగిన సమాచారం సేకరిస్తారు. కళార్చన ఉద్దేశం కళలను పోషిస్తున్న కళాకారులను గుర్తించి వారికి వారి కళకి పేరు ప్రఖ్యాతలు వచ్చేట్లు తోడ్పాటు ఇవ్వడమే.
కళల ఎంపిక విధానం :
వివిధ కళారంగాలలో వచ్చిన దరఖాస్తులు సీనియర్ జర్నలిస్ట్స్ , ఉపాధ్యాయుల జూరీ పరిశీలించిన పిదప  మార్కాపురం, కందుకూరు , ఒంగోలు డివిజన్ స్థాయులలో ఫైనెస్ట్ గా సెలెక్ట్ అయిన కళాకారులకు ‘భారతీయం’ కళార్చన – 2019  ఆహ్వానం పంపడం జరుగుతుంది.
ప్రకాశం జిల్లా 64+ కళలకు, వాటిని పోషిస్తున్న కళాకారులకు ఇచ్చు ప్రోత్సాహకాలు:
మీ కళకు గుర్తింపుగా సర్టిఫికేట్ మూడు విభాగాలలో (బాలుర : 16 సం లోపు  , యువ : 16-35 సం , సీనియర్ : 35 పైన) వివిధ కళలలో కళార్చనకు ఎంపికైన కళాకారులకు డివిషన్ ల స్థాయిలో (మార్కాపూర్ ఫైనెస్ట్, కందుకూర్ ఫైనెస్ట్, ఒంగోల్ ఫైనెస్ట్ గా) మరియు జిల్లా స్థాయి లో  (ప్రకాశం ఫైనేస్ట్ గా) సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది.
ఇంటర్నెట్ లో మీ పేరు చిరస్థాయిగా ఉండేటందుకు డివిషన్లస్థాయిలో మరియు జిల్లాస్థాయి లో సర్టిఫికేట్ పొందిన starsని Prakasam Wall Of Stars – 2019 పేరు మీద ఇంటర్నెట్ లో వారి బయోడేటాను పెట్టి గుర్తించడం జరుగుతుంది.
ఒంగోలు మర్యాదలు ఆహ్వానిత కళాకారులకు ట్రావెల్ సబ్సిడీ, భోజన వసతి ఇవ్వడం జరుగుతుంది.
ఆర్ధిక తోడ్పాటు 20 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకునే కళా రూపాలకు గౌరవ పారితోషకం ఇవ్వడం జరుగుతుంది.

 

Create your website at WordPress.com
Get started
%d bloggers like this: